30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఎమ్మెల్సీ కవిత కనిపించట్లేదు

29-09-2024 01:03 AM

పోలీసులకు ఉద్యమకారుల ఫిర్యాదు 

నిజామాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత  కొంత కాలంగా కనిపించడం లేదం టూ తెలంగాణ ఉద్యమకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె వెంట నడి చి, ఆమె అనుచరులుగా ఉన్నవారే కవితపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆదే ప్రవీణ్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లిక్కర్ కేసులో దాదాపు ఆరు నెలలుగా జైలులో ఉన్న కవిత, జైలు నుంచి విడుదలై దాదాపు నెల రోజులకు పైగా గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు రాలేదని, ఆమెను వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న కవిత, ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు దూరంగా ఉండటం తగదన్నారు.