24 August, 2026 | 11:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం

17-06-2026 01:26 PM

రైతులకు ఎలాంటి కొరత లేకుండా పకడ్బందీగా ఎరువుల సరఫరా

త్వరలో తిరిగి ప్రారంభం కానున్న యూరియా బుకింగ్ యాప్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూన్ 17(విజయక్రాంతి): ప్రస్తుత వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.

నిల్వల వివరాలు

జిల్లాలో ప్రస్తుతం 18,750 మెట్రిక్ టన్నుల యూరియా (సుమారు 4,12,511 బస్తాలు) నిల్వ ఉందని,

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఇతర కంపెనీల నుంచి ప్రతి వారం నిల్వలు నిరంతరంగా అందుతున్నాయని అన్నారు. 

రైతులకు కలెక్టర్ భరోసా

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడంతో, విత్తన ప్రక్రియ మందగించిందని, అందువల్లనే యూరియా బుకింగ్ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఈ యాప్‌ను తిరిగి అందుబాటులోకి తెస్తామని, రైతులు ఎవరూ ఎరువుల లభ్యతపై ఆందోళన చెందవద్దని ఆయన కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఎరువుల సరఫరా పకడ్బందీగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.