22 August, 2026 | 6:57 PM

జీవో 97న రద్దు కోరుతూ ABVP ధర్నా

22-08-2026 06:18 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని శక్తి స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని SBTET కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి NTR చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ విద్యార్థులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్న పాలిటెక్నిక్ విద్యను తీసివేసే విధంగా విద్యను పూర్తిగా ప్రవేటు వ్యక్తుల చేతిలో పెట్టే విధంగా స్కిల్ ఇండియా పేరుతో చేస్తున్న కుట్రను మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి సూటిగా తెలిపారు.

SHAKTI స్కీమ్ పేరుతో SBTET తొలగించే విధంగా విద్యార్థులను మరింత ఉన్నత చదువులకు వెళ్లనివ్వకుండా అందరిని లేబర్ ల వలె తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఐటిఐ ఒకేషనల్ పాలిటెక్నిక్ ఒకే రకమైన విద్యలో భాగం కాలేవని పాలిటెక్నిక్ ని యధావిధి గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కనీసం వాటిని అయినా మెరుగుపరిచి పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని తీసుకున్న జీవో నెంబర్ 97 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని నిరంతరం విద్యార్థుల వెంట ఏబీవీపీ ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చిప్ప యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి తదితరులు పాల్గొన్నారు.