ఏసీబీ వలలో మహబూబ్ నగర్ డీఈవో
07-11-2024 10:02 AM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా చెందిన డిఈవో రవీందర్ ఏసీబీకి గురువారం చిక్కారు. వివరాల్లోకి వెళితే.. సీనియారిటీ జాబితాలో తన పేరు నమోదు చేయాలని ఓ వ్యక్తి డీఈవో రవీందర్ ను అడిగాడు. దీంతో డీఈవో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్క పతకం ప్రకారం మహబూబ్ నగర్ డీఈవో రవీందర్ బాధితుడి నుంచి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డీఈవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు.






