11 March, 2026 | 2:54 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు

04-12-2024 04:58 PM

గద్వాల (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో ఉన్న ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం మంగళవారం రాత్రి 8:00 నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించినట్లు సమాచారం. అంతరాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఏఎంఐ అధికారులు రమేష్, అమృతవర్షిని, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, హోమ్ గార్డ్ గోవిందులను ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో.. చెక్‌ పోస్టు ప్రాంతం నిర్మానుషంగా మారింది. ఒక్క వాహనం కూడా చెక్ పోస్ట్ దగ్గర నిలవకపోవడంతో.. ఏం జరిగిందో అన్న పరిస్థితి ఏర్పడింది.