నిత్యజీవితంలో యోగ దినచర్య కావాలి: యోగా ట్రైనర్
బోథ్,(విజయక్రాంతి): యోగ నిత్యజీవితంలో దినచర్యగా మారాలని ఒకరోజు చేసి యోగాను మరిచిపోవద్దని యోగా ట్రైనర్ మల్లెపూల విజ్ఞత పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మండలంలోని కౌట బి గ్రామ ఉన్నత పాఠశాలలో యోగ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు ఉపాధ్యాయులకు యోగ ఆసనాలను వేయించారు యోగా ప్రతిరోజు చేయాలని దీంతో అనేక లాభాలు ఉంటాయన్నారు.
శారీరకంగా మానసికంగా యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు మానసిక ప్రశాంతతకు యోగ ఉపకరిస్తుందని పేర్కొన్నారు ప్రపంచ దేశాలకు మన దేశం యోగా ను పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉరుపులు ఉరుకులు పరుగుల జీవితానికి యోగ ఎంతగానో ఉపకరిస్తుంది అన్నారు డబ్బు కన్నా ఆరోగ్య ముఖ్యమని తెలపడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు






