21 June, 2026 | 7:20 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏకలవ్య పాఠశాలలో యోగ కార్యక్రమం

21-06-2026 06:05 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనరావుపేట మండలంలోని మరిమండ్ల గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి యోగాసనాలు నిర్వహించిన సీఐ రవీందర్, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

అలాగే ప్రస్తుత సమాజంలో యువతను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలు, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.