భూపాలపల్లి మైన్స్ AD ఇంట్లో ఏసీబీ సోదాలు
27-08-2026 11:24 AM
గనుల శాఖ ఏడీపై అక్రమాస్తుల కేసు
12 చోట్ల తెలంగాణ ఏసీబీ సోదాలు
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ (AD) జయరాజు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. సూర్యాపేట, తాండూరుతో సహా మొత్తం 12 చోట్ల జరిగిన సోదాలకు వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వం వహించారు. భూపాలపల్లి, హైదరాబాద్‌లోని సదరు ఏడీ (AD) నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.






