03-12-2025 03:57:15 PM
రూ.16,000 లంచం తీసుకుంటు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుండి రూ..16,000 లంచం తీసుకుంటుండగా ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సాయికుమార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ సాయికుమార్ అనే వ్యక్తినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.