calender_icon.png 3 December, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ మాటలపై జగ్గారెడ్డి ఆగ్రహం

03-12-2025 04:08:16 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కఠినంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, రాజకీయ నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల కోసం తెలంగాణ ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ... రాహుల్ గాంధీకి విజన్ లేదు అని కేటీఆర్ చెప్పడం అనేది అతిశయోక్తి. తెలంగాణ రాష్ట్ర నిర్ణయం వల్ల కాంగ్రెస్‌కి నష్టం జరుగుతుందని సోనియా గాంధీకి తెలిసినా, ప్రజల కోరిక కోసం రాష్ట్రం ఇచ్చారు.

తెలంగాణ ఇచ్చిన నిర్ణయానికి నేను సాక్ష్యం అని అన్నారు. అలాగే కేటీఆర్‌ను ఉద్దేశించి, మీరు సీఎం కొడుకుగా లభించిన ప్రయోజనం రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణ వల్లే. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడితే, కేసీఆర్ గురించి కూడా నిజాలు బయట పెడతా అని హెచ్చరించారు. జగ్గారెడ్డి మరోసారి స్పష్టం చేస్తూ, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసింది. అలాంటి నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు అని అన్నారు.