03-12-2025 03:54:17 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(టియూడబ్ల్యూజే-ఐజేయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని పౌర సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన జర్నలిస్టుల మహా ధర్నాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, ఐజేయు సీనియర్ నాయకులు నగునూరి శేఖర్ హామీ ఇచ్చినట్లు జిల్లా నాయకులు తెలిపారు.