19-10-2025 09:43:17 AM
శనివారం అర్ధరాత్రి నుండి ఏసీబీ అధికారులు దాడులు
పలు చోట్ల పట్టుబడ్డ నగదు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రవాణా చెక్ పోస్టుల్లో అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చెక్ పోస్టులపై ఎసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కొత్తగూడెం, పాల్వంచ, ముత్తగూడెం చెక్ పోస్టులపై డీఎస్పీవై రమేష్ ఆధ్వర్యంలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనధికార నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం చెక్ పోస్ట్ లు ఎత్తివేసినప్పటికి అనధికారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెక్ పోస్టులు నిర్వహిస్తూ రవాణాశాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల అర్ధరాత్రి దాడులలో పెద్ద ఎత్తున నగదు పట్టుపడ్డట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.