15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సర్కార్‌కు చెడ్డపేరు తేవొద్దు

19-10-2025 01:11 AM

-ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం సహించం

-రెండేళ్లునా కొందరు అధికారుల పనితీరులో మార్పు రాలేదు

-ఇప్పటికైనా అలసత్వం వీడాలి

-ప్రజాహిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

-సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : అధికారులు ఎవరికి వారుగా సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజా హిత కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు.

శనివారం తన నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరిస్తూ మరింత చురుగ్గా పనిచేయాల ని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు అలసత్వం వీడాలని సూచించారు.

పనుల పురోగతిని సమీక్షించాలి

అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. ప్రభు త్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను తన దృష్టికి తీసుకురావాలని సీఎంవోలకు సూచించారు. ఎక్కడ కూడా ఫైలు, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖ ల కార్యదర్శులకు సూచించారు. ఏయే పథకాల్లో రాష్ర్ట వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఇకపై సీఎస్‌తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు.