calender_icon.png 19 October, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కామారెడ్డి జిల్లాలో ఆర్టిఏ పోస్టులపై ఏసీబీ అధికారుల దాడులు

19-10-2025 10:15:55 AM

మద్నూర్, పొందుర్తి చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన అధికారులు 

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగిన తనిఖీలు 

ఏసీబీ అధికారుల అదుపులో ప్రైవేట్ వ్యక్తులు 

1,36, లక్షల నగదు స్వాధీనం 

కేసులు నమోదు చేసిన  ఏసీబీ అధికారులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఆర్టిఏ చెక్ పోస్టులపై ఏసీబీ(Anti-Corruption Bureau) అధికారులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీబీ అధికారులు చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు. మద్నూర్ చెక్ పోస్టుపై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా ఓ ప్రైవేటు వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 36 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులుగా గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని పొందుర్తి చెక్ పోస్ట్ ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏఎంవిఐ అఫ్రోజ్ వద్ద రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ చేస్తే  రూ.45 వేల ఒక వంద ఉండాల్సి ఉండగా రూ.51,300 స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు వాహనాల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తునట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పొందుర్తి మద్నూర్ ఆర్టిఏ చెక్పోస్టుల  వద్ద ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో రవాణాశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా జిల్లాలోని రెండు చెక్పోస్టులను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం విధితమే. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఏ చెక్పోస్టులలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించ గా కామారెడ్డి జిల్లాలోని పొందుర్తి, మద్నూర్ ఆర్ టి ఏ చెక్ పోస్టులలో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు దాడులు చేసి  నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతుంది.