ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ
13-05-2025 12:00 AM
మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అదనపు కలెక్ట ర్ సబావత్ మోతిలాల్ తో కలిసి సోమ వా రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజల నుం చి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






