వైద్య వృత్తిలో నర్సుల పాత్ర కీలకం
కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్
ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): వైద్య వృత్తిలో నర్సులు అందిస్తున్న సేవలు స్పూర్తి దాయకమని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ అన్నారు. సోమ వారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకోని భోలక్పూర్, ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిం చారు.
ము ఖ్యఅతిథిగా హాజరైన కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ నర్సింగ్ వ్యవస్థాపకురాలుఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సులను శాలువాలతో సన్మానించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ... నర్సులు కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగిం చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. సేవే లక్ష్యంతో పనిచే స్తున్న నర్సులకు ఏమి ఇచ్చినా తక్కువే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం నవీన్ గౌడ్, ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి, స్టాఫ్ నర్సులు పిహెచ్‌ఎన్ పెల్లీస్, విజయ కుమారి, సునిత, పద్మలత, సంతోషిణి, రత్నమాల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.






