అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
- అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు...
- కన్నీటి వీడ్కోలు పలికిన గ్రామస్థులు..
- అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్, మే 12 (విజయక్రాంతి): దేశ రక్షణ కోసం సేవలందిస్తూ అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన ఆర్కే మేఘనాథ్ గత కొన్నాళ్లుగా సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఝార్ఖం డ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యం కారణంగా సోమవారం మృతిచెందాడు.
స్వ గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. మేఘనాథ్ బౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పిం చారు. జవాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, గ్రామస్థులు జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. దారి పొడవునా ప్రజలు చేసిన దేశభక్తి నినాదాలతో గ్రామం మారు మ్రోగింది.
అనంతరం జవాన్ మేఘనాథ్ భౌతికాయంపై జాతీయ జెండానుంచి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా వెళ్లి దేశ సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టమని అన్నారు.
కానీ అనారోగ్యంతో జవాన్ మేఘనాథ్ చనిపోవడం బాధాకరమని ఆ దేవుడు మేఘ నాథ్ ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరారు. మేఘనాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండ గా ఉండేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గిరిజన శాఖ ద్వారా కుటుంబానికి న్యాయం జరిగిలా చూస్తానని హామీ ఇచ్చారు.






