calender_icon.png 8 November, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పత్తి దగ్ధం

08-11-2025 08:36:44 PM

బెజ్జంకి: ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని పత్తి దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రైతు బండి ఐలయ్య తన భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. వారివి గత కొద్దిరోజులుగా పత్తి తీత పనులు జరుగుతున్నాయి, తీసిన పత్తిని అమ్ముకుందామంటే  పత్తి కొనుగోలు కేంద్రలలో తేమశాతం ఎక్కువ వస్తే తీసుకోవడం లేదని వారు పత్తి చేను నుండి ఇంటికి తెచ్చిన పత్తిలో తడి ఆరేందుకు ఆరుబయట ఖాళీ స్థలంలో టార్పాలిన్లు వేసి ఆరబెట్టారు.

శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పత్తి మొత్తం కాలి బూడిదైంది. రైతు బండి ఐలయ్య అతని కుమారులు రమేష్, అనిల్, ఇతర సమీపంలోని వారు మంటలను గమనించి వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కాలేదు. కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఆరుగాలం చేసిన పత్తి పంట సుమారుగా 300 క్వింటాళ్ల పత్తి కళ్ళముందే కలిపోయిందని బోరున విలపించారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు.