17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇల్లెందులో ఘోర రోడ్డు ప్రమాదం

25-02-2026 03:21 PM

- ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇల్లెందు,(విజయక్రాంతి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడటంతో వాటిపై నుండి లారీ వెళ్లగా ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇల్లెందు మండలం సుదిమల్ల స్టేజి, జగదాంబ గుంపు వద్ద జ‌రిగింది. బుధవారం మధ్యాహ్నం ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు వివాహ వేడుక వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేశ్‌, పాయం చిన్ని, పాయం ధనలక్ష్మి (45), జయశ్రీ(18) రెండు బైక్‌ల‌పై ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్తున్నారు. ప్ర‌యాణంలో ప్రమాద‌వ‌శాత్తు బైక్‌లు ఒక‌దానినొక‌టి ఢీకొని కింద‌ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో వెనుక నుండి వ‌చ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు క్షతగాతృల్ని అంబులెన్సులు, ఆటోల్లో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.