25 February, 2026 | 5:28 PM

సమస్యలను పరిష్కరించాలని వినతి

25-02-2026 03:18 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో  స్ట్రీట్ లైట్లు , మంచినీటి ఇంటర్ కనెక్షన్లు కల్పించాలని కోరుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి కు సమర్పించారు. డాక్టర్ అనిత మాట్లాడుతూ పట్టణంలోని అనేక కాలనీల్లో సరైన వీధి దీపాల లేకపోవడం వల్ల రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వలీ భాయ్, వసీం అహ్మద్, నంది సాయి, మాణిక్య రావు తదితరులు పాల్గొన్నారు.