08-11-2025 08:35:43 PM
- పైసాలు ఇయ్యకుంటే శాపనార్థాలు
- వికృత చేష్టలపై సర్వత్రా విమర్శలు
కాటారం,(విజయక్రాంతి): పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పేరంటాలు చేసుకోవాలంటేనే కాటారం పరిసర ప్రాంత ప్రజలు హిజ్రాల జబర్దస్త్ వసూళ్లపై బెంబేలెత్తుతున్నారు. మగవాళ్ళు లింగ మార్పిడి చేసుకొని ఆడవాళ్లు లాగా మారిన ట్రాన్స్ జెండర్లు, హిజ్రాలు నానా హంగామా సృష్టిస్తున్న తీరుతో శుభకార్యాలు చేసుకునే నిర్వాహకులు బయాకంపితులవుతున్నారు. ఇళ్లల్లో జరిగినా.. ఫంక్షన్ హాల్లలో జరిగినా.. హిజ్రాలు వదలట్లేదు.
వారు వచ్చిందంటే పదివేలకు పైగానే డిమాండ్ చేస్తూ, చప్పట్లతో మొదలుపెట్టి చీరలు పైకెత్తే వికృత చేష్టలతో విసిగి వేసారి పోయేలా హిజ్రాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లో హిజ్రాలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని పెండ్లిళ్లు చేసేవారు మొరపెట్టుకున్నారు. పేదవారు శుభకార్యాలు చేయాలంటే హిజ్రాల బాధలు భరించలేక మధనపడుతున్నారు. హిజ్రాలు అడిగినంత ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదనతో విలేకరులతో మొరపెట్టుకున్నారు.
కాటారం సబ్ డివిజన్ లోని కాటారం, మహముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హర్ మండలాలలోని గ్రామాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఏజెంట్ల ద్వారా ఎక్కడ శుభకార్యం జరిగిన అదే రోజు ముహూర్తం సమయానికి చేరుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారు అడిగినంత ఇయ్యని యెడల నానా హంగామా సృష్టిస్తూ బూతు పురాణాన్ని మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా గృహప్రవేశాలు, షాప్ ల ఓపెనింగ్, శుభకార్యాలయాలకు డబ్బులు ఇవ్వకుంటే వారు ధరించిన దుస్తులను తీసివేయడం, శాపనార్థాలు పెట్టడం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు . హిజ్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.