సీఎం రేవంత్ రెడ్డితో అడోబ్ సీఈవో భేటీ - గ్లోబల్ ట్రెండ్స్‌పై చర్చ
25-02-2026 03:18 PM
హైదరాబాద్: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్(Telangana Rising 2047 Vision) బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డితో శంతను చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలి, ముఖ్య సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.




