23 April, 2026 | 8:05 PM

రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకు ముందు ఖాతాదారుల ధర్నా

26-05-2025 12:07 PM

హైదరాబాద్ : వరంగల్ రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంక్(Raiparthy SBI Bank) ముందు ఖాతాదారులు ధర్నాకు దిగారు. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాతాదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైంది. తమ బంగారం తిరిగి ఇవ్వాలంటూ కొన్నాళ్లుగా ఖాతాదారులు నిరసన చేస్తున్నారు. 497 మంది ఖాతాదారులకు ఎస్బీఐ బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఖాతాదారులు బంగారం, పరిహారం కోసం ఎస్ బీఐని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంక్ చుట్టూ తిరిగి విసిగిపోయామంటూ గోల్డ్ లోన్ రుణ గ్రహీతలు(Gold Loan Borrowers) వాపోతున్నారు.