డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పెంచాలి
- పలు జర్నలిస్టు సంఘాల డిమాండ్
- ఐఅండ్‌పీఆర్ కమిషనరేట్ ఎదుట ధర్నా
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పెంచాలని డీజేఎఫ్‌టీ రాష్ట్ర అధ్య క్ష, కార్యదర్శులు జ్యోతిబాసు, మస్తాన్ కోరా రు. అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించడంపై సోమవారం హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఐఅండ్‌పీఆర్ అధికా రి జగన్‌కు వినతిపత్రం అందించారు. ధర్నా కు టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే, టీ యూడబ్ల్యూజే (143), హెచ్‌యూజే సం ఘాలు మద్దతు ప్రకటించాయి. జ్యోతిబసు, మస్తాన్ మాట్లాడు తూ..
ఎడిషన్ సెంటర్‌కు ౪ అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమన్నారు. ఒక్కో ఎడి షన్‌లో ౩ నుంచి ఆరు జిల్లాలున్నాయని వాటికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సిటీకి కూడా ఆరు కార్డులే ఇస్తున్నారని, కనీసం 17 నుంచి 18 మంది పని చేస్తున్నారని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించారని చెప్పారు.
వారికి కూడా15 కార్డులు ఇవ్వాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, కోశాధికారి యోగి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్, హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, డీజేఎ ఫ్‌టీ రాష్ట్ర నాయకురాలు విజయ, టీడబ్ల్యూజేఎఫ్ కారదర్శి దామోదర్, టీయూడబ్ల్యూ జే హైదరాబాద్ ఇన్చార్జీ నవీన్‌కుమార్ యా రా, డీజేఎఫ్ టీ నాయకులు లలిత, నిస్సార్, దొడ్డి శేఖర్, ఓగోటి కిరణ్ కుమార్, హెచ్‌యూజే కార్యదర్శి జగదీష్, డెస్క్ జర్నలి స్టులు వినోద్ రావు, మనీష్, శంకర్, బిక్షమ య్య, మధుబాబు, రమేష్, రవి, భాస్కర్ పాల్గొన్నారు.




