14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

24-02-2026 12:51 AM

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 23: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి గౌరెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 206 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాము తన  సిబ్బందితో కలసి శుక్రవారం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడ జేసీబీల సహాయంతో కూల్చివేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రభుత్వ భూములను ఆక్రమించిన, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు. చట్టానికి ఎవ్వరు అతిథులు కాదని ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాము, జీపీవో, సిబ్బంది తదితరులు ఉన్నారు.