జ్యూవెలరీ షాప్ లో దోపిడి.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
22-06-2024 04:48 PM
హైదరాబాాద్: నగర శివారులోని జగదాంబ జ్యూవెలరీ షాప్ లో దోపిడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడికి పాల్పడిన ఇద్దరు దుండగులను 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన మేడ్చల్ జిల్లాలోని జగదాంబ జ్యూవెలరీ షాప్ లోకి ఇద్దరు దుండగులు హెల్మెట్, బుర్ఖా ధరించి వెళ్లి షాప్ యజమానిని కత్తితో బెదిరించారు. అనంతరం కత్తితో పొడిచి డబ్బులు దోచుకున్నారు. ఈ దాడిలో షాప్ యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. జ్యూవెలరీ షాపులో సీసీఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.






