పోక్సో కేసులో నిందితుడికి జైలు
11-12-2024 12:34 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 10: పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రెండేళ్ల్ల జైలుశిక్ష విధించింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రా్రష్ట్రానికి చెందిన రామ్‌కుమార్(25) హైదరాబాద్‌లోని నాగోల్‌లోని బండ్ల గూడ ఆనంద్‌నగర్‌లో నివా సం ఉంటూ మార్బుల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
2020 సంవత్సరం లో రామ్‌కుమార్.. ఓ మైనర్ తో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికదాడికి యత్నించా డు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ఎల్బీనగర్‌లోని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రామ్‌కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ రెండేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.






