9 May, 2026 | 12:21 PM

తెలంగాణ తల్లి అంటే గరీబోళ్ల తల్లి

11-12-2024 12:32 AM

* తెలంగాణ తల్లి అంటే ఒక వైపు డబ్బు.. మరో వైపు లిక్కర్ సీసా ఉండాలా? 

* పదేళ్లలో విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించలేదు ?

* బీఆర్‌ఎస్‌పై విప్ బీర్ల అయిలయ్య ఫైర్ తెలంగాణ తల్లి అంటే గరీబోళ్ల తల్లి తెలంగాణ తల్లి అంటే గరీబోళ్ల తల్లి 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ కవులు, మేధావులు, అన్నివర్గాల ప్రజలతో చర్చించాకనే సచివాలయంలో తెలంగాణ తల్లి  విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ప్రభుత్వ విప్ బీఆర్ల అయిలయ్య అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రావాలని కేసీఆర్‌ను కలి సి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తే ఎం దుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఒకవైపు డబ్బు.. మరోవైపు లిక్కర్ సీసా ఉండాలా? అని ఆయన మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చిన కవిత తెలంగాణ విగ్రహం తనలాగా ఉండాలని అనుకుంటోందని విమర్శించా రు.

మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లా డుతూ తెలంగాణ తల్లి విగ్రహం అంటే గడీల తల్లి కాదని, గరీబోళ్ల తల్లి కావాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించలేదో తెలపాల్సిన అవసరం ఉందని ఆయన  నిలదీశారు.