31 March, 2026 | 11:37 PM

పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..హెడ్ మాస్టర్ సస్పెండ్

18-02-2025 04:40 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు(KCR Birthday Celebrations) నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి (District Education Officer) ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ నేతృత్వంలో పార్టీ కండువాలతో క్లాస్‌రూమ్‌లలోకి ప్రవేశించి విద్యార్థుల చేత నినాదాలు చేయించారు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టి, ప్రభుత్వ విధానాలను ఉల్లంఘించినందుకు హెడ్ మాస్టర్‌(Headmaster )పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, పిల్లలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.