27 February, 2026 | 5:18 PM

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి నియామకం

27-02-2026 12:00 AM

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 26 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్ గా ఆర్థిక శాస్త్ర విభాగం ఆచార్యులు, ఆరట్స్, సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డిని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  విశ్వవిద్యాలయ బాధ్యతలే కాకుండా తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఆర్థిక శాస్త్ర oలో పరిశోధనలకు తన వంతు కృషి చేస్తున్నారు.

రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కొప్పుల అంజిరెడ్డికి  ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మరియు అధికారులు ఆచార్య అలువాల రవి, ఆచార్య ఆకుల రవి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు అధ్యాపకులు విద్యార్థులు అభినందనలు తెలిపారు.