27 February, 2026 | 3:24 PM

కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహనా సదస్సు

27-02-2026 12:00 AM

కోదాడ, ఫిబ్రవరి 26 : కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో రామన్ ఎఫెక్ట్ పై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర మానవ వికాస ఉపాధ్యక్షులు పీ వీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రవేత్త సీ వీ రామన్ జీవిత విశేషాలు వివరిస్తూ, తాను రామన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనుగొన్నాడో తెలిపి అది నేటి తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలిపారు.

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, వివిధ విభాగాదిపతులు, అధ్యాపకులు, ముత్యాలు, విద్యార్థినులు పాల్గొన్నారు.