4 May, 2026 | 12:26 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ఫార్మాసిటీకి సేకరించింది 14,225ఎకరాలు

18-03-2025 01:42 AM

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా యా చారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో రైతునుంచి పట్టా, ప్రభుత్వ భూములు కలిపి 14,021.12 ఎకరాలు సేకరించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ఫా ర్మా సిటీ కోసం 19,333 ఎకరాల భూమిని సేకరించిన మాట వాస్తవమేనా? అని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అడగ్గా.. పొం గులేటి సమాధానం ఇచ్చారు. గత సర్కారు 14,225.31 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించిం దన్నా రు.

ఇందులో 14,021.12 ఎకరాలు సేకరించగా..మరో 204.19ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. పరిహా రం విషయంలో అవకతవకలు జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి వ చ్చిందని దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.