23 July, 2026 | 1:23 PM

ధర్మేంద్రప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షం పట్టు.. ఉభయ సభలు వాయిదా

23-07-2026 12:51 PM

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగడానికి ముందే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Education Minister Dharmendra Pradhan resigns) చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొనడంతో, గురువారం ఉభయసభల కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ అంశంపై ఉభయ సభల్లోనూ చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఎటువంటి షరతులూ ఉండకూడదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, అటువంటి చర్చ ఏదైనా జరిగే ముందు ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు.