‘పసుపు నీళ్లతో శుద్ధి’పై చర్యలు

16-09-2026 | 12:00am
  1. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  2. రిమాండ్ విధించిన గజ్వేల్ కోర్టు

గజ్వేల్, సెప్టెంబర్ 15: సిద్దిపేట జిల్లా(Siddipet District) మర్కుక్ మండలం(Markook Mandal) వరదరాజపూర్ చౌర స్తాలో దళితులు(Dalits) నడిచి వెళ్లిన ప్రాంతంలో శుద్ధీకరణ(Purification) పేరుతో పసుపు నీటిని(Turmeric water) చల్లిన ఘటనపై నమోదైన కేసులో ఏడుగురు నిందితులను మర్కుక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 8వ తేదీ నుంచి జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress Party) దళిత విభాగం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, ఘటనకు సంబంధించిన ఫొటోలు(Photos), వీడియోలు(videos), ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించారు.

ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సోమవారం విజయవాడలో అప్పాల ప్రవీణ్, రెడ్డిబోయిన అమరేందర్, శ్రీపతి రాజు, ముచ్చపతి హిమవంత్, అంతని ఐలయ్య, అరికెల రాజు, అంతని మల్లేష్‌లను అరెస్ట్ చేశారు. గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఘటనకు సంబంధించి మిగిలిన నిందితుల గుర్తింపు, అరెస్టు ప్రక్రియ కొనసాగుతోందని గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. సామాజికంగా సున్నితమైన ఈ ఘటనపై దర్యాప్తును అన్ని కోణాల్లో కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు