దేవుళ్లను దూషించిన సీఐపై చర్యలు తీసుకోవాలి
08-06-2024 03:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్7 (విజయక్రాంతి): హిందూ దేవుళ్లు, ఆలయ పూజారి పట్ల దురుసుగా మాట్లాడిన కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ శివగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణతో కలిసి ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 24న ఆలయ భూమి విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అక్కడకు వెళ్లిన రూరల్ సీఐ రాంబాబు ఆలయ కమిటీ సభ్యులను, పూజారిని ధూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ, అదనపు ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తెలిపారు.






