ఎమ్మెల్సీలు మధు, నవీన్‌పై వేటు

09-09-2026 | 05:45am

సస్పెన్షన్‌కు మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం 

మూజువాణి ఓటుతో ఆమోదం  

ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిన మండలి చైర్మన్ గుత్తా 

అంతకుముందు శాసనసభలోనూ ఎమ్మెల్సీలపై చర్యలకు తీర్మానం

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పోలీసులపై చేయి చేసుకున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు(Tata Madhu), ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డి(Naveen Kumar Reddy)పై సస్పెన్షన్ వేటుపడింది. వీరిద్దరినీ సస్పెండ్ చేయా లని మంగళవారం శాసనమండలి(Legislative Council)లో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) తీర్మా నం ప్రవేశపెట్టారు. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukhender Reddy) ప్రస్తుత సెషన్ వరకు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతుకుముందు అసెంబ్లీలోనూ ఇద్ద రు ఎమ్మెల్సీలపై చర్యలకు తీర్మానం చేశారు. తీర్మాన కాపీని మంత్రి దామోదర రాజనరసింహ మండలికి పంపించారు. దానిపై మండ లి చైర్మన్ చర్య తీసుకున్నారు. వారిద్దరిపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ తీర్మానించిందని చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం మండలిని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని, మహిళా సభ్యులను అడ్డగించిన పోలీసుల తీరుపై ఆ పార్టీ శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. 

సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి మండలి ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ‘పిరికి ప్రభుత్వం నశించాలి, సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్, ఎమ్మెల్సీల సస్పెన్షన్ రూల్స్‌కు విరుద్ధం, దా నిని ఎత్తివేయాలి’ అంటూ నినాదాలు చేశా రు.

మహిళాద్రోహి ప్రభుత్వం, దుర్యోధన, దుశ్శాసన, ధృతరాష్ట్ర ప్రభుత్వం నశించాలని.. సభలో చర్చించకుండా ఏకపక్షంగా చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం తాతా మధు, ఎన్ నవీన్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీలు మాట్లాడకుండా వెళ్లాలని కోరి నా ససేమిరా అనడంతో వారిద్దరినీ బలవంతంగా అక్కడినుంచి తరలిం చారు. 

క్షమించరాని నేరం : మంత్రి దామోదర రాజనరసింహ 

అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, స్పీకర్ స్థానం ఏ ఒక్క కులానికో, మతానికో చెందినది కాదు. జాతి ఆత్మగౌరవానికి సంబంధించినది. అలాంటి పీఠంపై కూర్చున్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. అయితే రా జ్యాంగబద్ధమైన వ్యవస్థలను, అత్యున్నత పదవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

స్పీకర్ ప్రసాదరావు అత్యున్నత పదవిలో ఉండి కూడా అవమానం ఎదుర్కోవాల్సి రావటం బాధాకర మని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీల పట్ల మా నసిక అస్పృశ్యత కొనసాగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలో లేకపోయినా బీఆర్‌ఎస్ నేతల అహంకారం మాత్రం తగ్గలేదన్నారు. స్పీకర్ అవమానించామనే పశ్చాత్తాపం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపించడం లేదన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. 

ప్రజాస్వామానికి మాయని మచ్చ : డిప్యూటీ సీఎం భట్టి

స్పీకర్‌ను అవమానించడం అంటే ఒక వ్యక్తినే కాదు.. సభా మొత్తాన్ని అవమానించడమని, ఇది యావత్ ప్రజాస్వామ్యానికి మా యని మచ్చ అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ల తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని, బీఆర్‌ఎస్ అహంకార, భూస్వామ్య భావాజాలనికి ఇది నిదర్శనమన్నారు. ఫామ్‌హౌస్ ఆదేశాలతోనే చట్టసభలపై దాడికి కుట్ర జరిగిందని భట్టి ఆరోపించారు. తల్లిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం తెలంగాణ సం స్కారానికి అవమానకరమన్నారు.

సభాపతి గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అన్ని పార్టీలు ఎన్నుకున్నాయని, ఆయన దళిత వర్గం నుం చి ఎదిగి వచ్చిన వ్యక్తికావడం అదనపు గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.  ఆయనను కేవలం దళిత స్పీకర్ చూడటం సరికాదని, ప్రసాద్‌కుమార్ శాసనసభకు స్పీకర్ అని పే ర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి ని సహించబోమని, సభాపతి స్థానాన్ని, ప్ర జాస్వామ్య గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందన్నారు.

తాము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పరుష పదజా లం వాడలేదని భట్టి గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల టీషర్టులు ధరించి, వాటిపైన నినాదాలు రాసుకొని అసెంబ్లీకి రావడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌ను గ్రామస్థాయి వరకు ప్రజలు దూరంగా ఉంచాలన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది.

మరిన్ని వార్తలు