4 July, 2026 | 5:14 AM

ఫెస్టిసైడ్స్ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

12-06-2024 12:11 AM

వ్యాపారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే హెచ్చరిక

అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చట్టపర మైన చర్యలతోపాటు పీడీ యాక్టు నమోదు చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ కల్లెపు శోభ అధ్యక్షతన జరిగిన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడా రు. రైతులు వర్షాకాల పంటలు సాగు చేసు కుంటున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధి కారులు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా పీడీయాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వ్యవసా యశాఖ కమిషనర్‌తో మాట్లాడి ౩ వేల పత్తి గింజల ప్యాకెట్లు జిల్లాకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈసారి రైతులు సన్న వడ్లు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి పాఠశాలలు, వసతి గృహాలు, రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా చేయను న్నట్టు  వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీపీలు  పాల్గొన్నారు.