4 July, 2026 | 4:03 AM

శానిటేషన్ విధానాలు భేష్

12-06-2024 12:11 AM

తమిళనాడు ప్రతినిధుల బృందం 

వరంగల్ తూర్పు, జూన్ 11: గ్రేటర్ వరం గల్ అనుపరిస్తున్న శానిటేషన్ విధానాలను తమిళనాడు మున్సిపల్ ఉద్యోగులు అభి నందించారు. నగరంలో అనుసరిస్తున్న శాని టేషన్ విధానాలను పరిశీలించడానికి మం గళవారం తమిళనాడు మున్సిపల్ శాఖ అధికారుల బృందం వచ్చింది. అమ్మవారి పేట మలశుద్ధి నిర్వహణ కేంద్రాన్ని పరిశీ లించారు. ప్లాంట్  నిర్వహణ, సామర్థ్యం, ఉత్పత్తి చేయబడిన ఎరువుల వినియోగంపై తమిళనాడు అధికారులకు మేయర్ సుధా రాణి వివరించారు. అనంతరం తమిళనాడు మున్సిపల్ అధికారుల బృందం సభ్యులు మాట్లాడుతూ..

వరంగల్‌లో అనుసరిస్తున్న శానిటేషన్ విధానాలు బాగున్నాయని కితా బిచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల నుంచి తడి, పొడి చెత్తను వేర్వే రుగా సేకరించడంతో పాటు శాస్త్రీయ పద్ధతి లో పర్యవరణానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయడం అభినందిచాల్సిన విష యమన్నారు. భవిష్యత్తులో  సుందర నగ రాలను రూపొందించుకోవడానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ శానిటేషన్ విధానం లర్నింగ్ ప్లాట్‌ఫాం మాదిరిగా ఉన్నదని చెప్పారు. అనంతరం తమిళనాడు అధికా రుల బృందాన్ని  మేయర్ గుండు సుధా రాణి శాలువాలతో సత్కరించారు.