మున్సిపాలిటీలపై కాంగ్రెస్ గురి
నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో అవిశ్వాస తీర్మానాలకు రెడీ!
నాగర్‌కర్నూల్, జూన్ 11 (విజయక్రాం తి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అవి శ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ పాలక వర్గాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. జిల్లాలో ని మిగిలిన మున్సిపాలిటీలను కూడా వశం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది. అచ్చంపేట, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీల పై కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుని, పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం రాష్త్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో మున్సిపాలిటీలను కాంగ్రెస్ పరం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నది.
మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మన్ల చేతిలో పగ్గాలు ఉండటంతో పనులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచే స్తున్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మున్సిపా లిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ, ఎమ్మెల్సీ, పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ను వీడడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కాగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎవరిని నియ మించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ కౌన్సి లర్‌లతో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోధర్‌రెడ్డి సమాలోచనలు జరిపి అభిప్రాయాలను సేకరించారు.






