21 June, 2026 | 10:59 PM

‘ముందుమాట’ వివాదంఅధికారులపై చర్యలు ఉంటాయి

15-06-2024 01:10 AM

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలలో మాజీ  సీఎం కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లను ముద్రించినవారికి సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. శుక్రవారం ఆయన అసెం బ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పేరును ముద్రించిన పుస్తకాల్లోని ఆ పేజీని ఎంఈవో కార్యాల యంలోనే  తొలగించి విద్యార్థులకు అందజేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రం లో ఎన్నికల కోడ్ ఉన్నా మహిళా సంఘాల ద్వారా పుస్తకాలు పంపిణీ చేయించినట్టు చెప్పారు. కేసీఆర్ పేరు ఒక తెలుగు పుస్తకంలోనే ముద్రించారని, అది కూడా పాతపుస్తకాల్లోనే ఉందని వివరించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి మండల కేం ద్రంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.