పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు పదోన్నతి
15-06-2024 01:09 AM
ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): వివిధ శాఖల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా పని చేస్తున్న పలువురు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు జారీచేసింది. ము న్సిపల్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బీ, మహిళా శిశు సంక్షేమ, రవాణా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు అసిస్టెంట్ సెక్రటరీ లను డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోట్ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు 15 రోజ్లులోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.






