calender_icon.png 20 July, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చురుగ్గా వనమహోత్సవం

19-07-2025 01:15:31 AM

  1. కోటి 70 లక్షల మొక్కలు నాటిన పీఆర్, ఆర్డీ శాఖ
  2. మరింత వేగవంతం చేయాలి: మంత్రి సీతక్క 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం పల్లెల్లో జోరుగా సాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వచ్ఛదనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతేడాది 6. 90 కోట్ల మొక్కలు నాటిన ఘనతను సాధించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ ఏడు 7 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చురుకుగా ప ని చేస్తోంది.

ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో శుక్రవారం నాటికి 1.7 కోట్ల మొక్కలను నాటారు. ఇది మొత్తం లక్ష్యం లో 39 శాతమని అధికారులు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పీఆర్‌ఆర్డీ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 85 శాతం మేర గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వన మహోత్సవం కాస్త నెమ్మదిగా సాగుతోంది.

ఇప్పటివరకు ఆ జిల్లాలో 42 వేల మొక్కలను మాత్రమే ఇప్పటివరకు నాటా రు. దీంతో ఆ జిల్లాల్లో వన మహోత్సవం లో వేగం పెంచాలని పీఆర్‌ఆర్డీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ ఏడాది పండ్ల తోటలకు, ఉద్యానవన పంటలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. మంత్రి సీతక్క, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ జీ సృజన ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. దీంతో త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.