17 March, 2026 | 6:44 AM

ఉద్యమకారిణి టైగర్ నర్సమ్మ అనారోగ్యంతో మృతి

17-03-2026 12:25 AM

మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, మార్చి 16 (విజయక్రాంతి):సిద్దిపేట పట్టణానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఉద్యమకారిణి టైగర్ నర్సమ్మ  అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటే ఉండి మహిళలను ఉద్యమం వైపు మళ్ళించడంలో కీలక పాత్ర పోషించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశిలకంగా పని చేసింది,

ఉద్యమ సమయంలో మహిళా లోకాన్ని ఒక్క తాటి పైకి తెచ్చిందని, ఆమె పటిమను గుర్తించిన కెసిఆర్ టైగర్ నర్సమ్మ గా పేరు పెట్టారు. అలాంటి గొప్ప ఉద్యమ కారిణి, ఒక నిబద్దత గల నాయకురాలుగా 25ఏళ్లు పార్టీ కి అందించిన సేవలను మాజీ మంత్రి, సిద్దిపే ట ఎమ్మెల్యే హరీష్ రావు కొనియాడారు. ఆమె మృతి పార్టీ కి తీరని లోటని ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.