8 June, 2026 | 4:36 PM

విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ

08-06-2026 03:26 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలములోని కోక్యతాండ, టేకులపల్లి గ్రామం లోని విత్తన దుకాణాలను ఇల్లందు వ్యవసాయ సహాయ సంచాలకులు జి లాల్ చాంద్ సోమవారం తనిఖీ చేశారు. విత్తనాలు లైసెన్స్ పొందిన కంపెనీ నుండి వచ్చినవా లేదా, మొలక శాతం పర్మిషన్ ఉంది లేనిది రిజిస్టర్లు స్టాక్ బోర్డు వెరిఫై చేచారు. ఎవరైనా డీలర్ల నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు, కేసులు పెడతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ పాల్గొన్నారు.