26 July, 2026 | 1:58 PM

సర్ పై జుక్కల్ ఎమ్మెల్యే సమీక్ష

26-07-2026 01:15 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమీక్ష సమావేశంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIR కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, పిట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.