నర్సింగరావుపల్లి చౌరస్తాలో చాయ్ పే చర్చ
ప్రజల సమస్యలు స్వయంగా విన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా వద్ద ఉన్న ఓ హోటల్‌లో ఆదివారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు స్థానిక ప్రజలతో కలిసి చాయ్ తాగుతూ, వారి సమస్యలు, అభిప్రాయాలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, గ్రామంలో నెలకొన్న సమస్యలను ఓపికగా విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్న నాయకులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. అయన వెంట కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.






