హనుమాన్ మందిరానికి ఆటోమేటిక్ టైం బెల్ అందజేత
26-07-2026 01:30 PM
బోథ్,(విజయకాంతి): సోనాల మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయానికి ఆటోమేటిక్ టైం బెల్ ను దండారి సంతోష్, సంజీవులు వారి తండ్రి జ్ఞాపకార్థం అందించారు. ప్రతిరోజు వారానికి సంబంధించిన దేవుని పాటలతో పాటు భగవద్గీత ప్రసారమవుతుందని దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి శంకరయ్య, సుధీర్ రెడ్డి బద్దం రవి ఈర్ల అఖిల్, కార్తీక్ రెడ్డి తండారి శ్రీకాంత్ బద్దం శ్రీనివాస్, నరేష్లు ఉన్నారు.






