11 May, 2026 | 5:16 AM

స్టైల్‌కు చిరునామా!

17-08-2025 01:06 AM

‘నాన్నా..’ అంటూ ఆయన ఒక్క చిన్న డైలాగ్ వదిలితే చాలు థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. చేతులతో చొక్కాను రెండు వైపులా అలా విసి రేస్తే విజిల్స్ పడాల్సిందే. ఎవరైనా కళ్లజోడు సవరించుకుం టుంటే ఆయన్ను అనుకరిస్తున్నావు కదూ అంటూ ఆయన స్టుల్‌ను గుర్తు చేసేస్తారు. అంతలా స్టుల్స్‌కు, పంచులకు రజనీకాంత్‌కు పేటెంట్ ఇచ్చే అభిమానులెందరో! స్టుల్, పంచ్ ఆయన కోసమే పుట్టా యేమో అన్నంతగా క్రేజ్, ఇమేజ్ సొంతం చేసుకున్నారు. హీరోయిజం, మేనరిజానికి పెట్టింది పేరు సూపర్ స్టార్. 

రజనీకాంత్ సినీ ప్రస్థానం ఈ యేటితో 50 పూర్తయింది. ఆయన సినిమా వయసు 50 ఏళ్లు. హీరోగా 46 ఏళ్లు. ఇంత సుదీర్ఘ కాలం నెంబర్ వన్ హీరోగా ఉండడం ఒక ప్రపంచ రికార్డ్. ప్రముఖ డైరెక్టర్ బాలచందర్ 1975లో రజనీని వెండితెరకు పరి చయం చేశారు. బాగా పెరిగిన గుబురు గడ్డం, చిందరవందరగా కనిపించే జుట్టుతో వచ్చిన ఆయన తమిళ సినీ రంగంలో సూపర్‌స్టార్ అవుతా రని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే నడక తీరు, స్టుల్‌తో ఉన్నత శిఖరాలను చేరారు రజనీకాంత్. 

విలనిజం ఉట్టిపడే ప్రతినాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన రజనీ కాంత్ తమిళ సినిమాను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. భారతీయ చిత్రసీమలో తన స్టుల్‌లో చరిత్రను సొంతం చేసుకున్నారు. 1977లో 15 సినిమాల్లో నటిస్తే, ఎక్కువగా నెగెటివ్ రోల్స్. 78లో సోలో హీరోగా ‘భైరవి’ వచ్చింది. తర్వాత హీరోనే అని నియమం పెట్టుకో కుండా నటిం చారు. తమిళంలో దళపతి, అన్నామలై, మన్నన్.. అన్నీ హిట్సే కానీ, బాక్సాఫీస్ గోడల్ని బద్దలు కొట్టే సినిమా ఒకటి 1995లో వచ్చింది. ఆ చిత్రమే ‘బాషా’. 

ప్రతి కదలికలో స్టుల్..

ఇండియన్ స్క్రీన్ మీద రజినీకాంత్‌ది ఏ స్థాయి అంటే, ఆయన ఏం చేసినా లాజిక్ అడగకుం డా ఉండేంత! జస్ట్ మ్యాజిక్ అంతే!! అందుకే ఆయన పేరు రజినీకాంత్.. ఇంటి పేరు సూపర్ స్టార్. ఒంటిచేత్తో కొడితే పాతిక మంది గాల్లోకి ఎగురుతారు.

తంతే రైలు బోగి ఇనుప తలుపు కూడా బద్దలై పోతుంది. బుల్లెట్‌ని కూడా ఊదేయగలరు. ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుంది’, ‘ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’, ‘నా దారి.. రహదారి’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు తెలుగులో ఇప్పటికీ ఎంతో క్రేజ్. ‘పెదరాయుడు’ సినిమాలో మోహన్‌బాబు తండ్రిగా, ఊరిపెద్దగా ఇచ్చే తీర్పులు ‘ఆపరా..

అంతకుమించి ఒక్కమాట మాట్లాడినా’ అంటూ సాయికుమార్ డబ్బింగ్‌తో రజినీకాంత్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లింది. పెదరాయుడులో ఆయన చుట్టకాల్చే స్టుల్, భుజంపై కండువా వేసుకునే స్టుల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో ఆయన సిగరెట్ కాల్చే స్టుల్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. 73 ఏళ్ల వయసులో జైలర్‌లో ఫైట్స్ చేస్తే చప్పట్లు కొట్టారు. తాజాగా రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కూలీ’ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.