calender_icon.png 17 August, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్కడ రెండు రాజ్యాంగాలుంటాయ్!

17-08-2025 01:11:01 AM

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మరో సినిమా వస్తోంది. అదే ‘ది బెంగాల్ ఫైల్స్’. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ రంజాన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి సహ నిర్మాతలు. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్‌దేవ్, దర్శన్ కుమార్ ఇందులో భాగమయ్యారు. అనుపమ్ ఖేర్.. గాంధీజీ పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

బెంగాల్‌లో ప్రజలు ఎదుర్కొన్న గత సమస్యలను కళ్లకు కట్టేలా రూపుదిద్దుకుందీ సినిమా. ట్రైలర్‌లోని సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి. పవర్‌ఫుల్ డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షక హృదయాలను హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా ‘ఇది భారత్ కాదు.. పశ్చిమ బెంగాల్. ఇక్కడ రెండు రాజ్యాంగాలు అమలవుతున్నాయ్..’, ‘దేశం తగలబడిపోతూ ఉంటుంది.. ప్రజలు చనిపోతూ ఉంటారు.. ఆట సాగిస్తూ ఉంటారు’ అంటూ హిందీ వెర్షన్‌లో సాగే డైలాగులు గుండెల్ని తడి చేస్తున్నాయి.