ఘనంగా ఆది శంకరాచార్యుల జయంతి
ఖైరతాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన వేడుక ల్లో శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, మంగళ హారతులు ఇచ్చి వారు చేసిన ధర్మ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వీహెచ్‌పీ ధర్మా చార్య సంపర్క ప్రముఖులు పగడాకుల బాలస్వామి మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్తంభమని కొనియాడారు. హిందూ సమాజం ఆయన బోధనల ను, ఆచరణలను ఆదర్శంగా తీసుకుని ధర్మ పరిరక్షణలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేం దుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని బాలస్వామి సూచించారు. ఈ వేడుకల్లో విశ్వహిం దూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ తో పాటు గణేష్, జగన్, రమణారెడ్డి, హరికృష్ణ, కార్తీక్, శివ సాయి తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






